calender_icon.png 8 July, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులను నిలిపివేయాలి..

07-07-2025 10:16:55 PM

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు..

వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులను నిలిపివేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప రాంబాబు(BRS Party Mandal President Gampa Rambabu) డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేసి బిఆర్ఎస్ నాయకులను సోమవారం పోలీస్ స్టేషన్ కి తరలించి నిర్బంధించారని వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను, అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతున్నదని అన్నారు.

అధికారం రాకముందు ఆరు గ్యారెంటీల పేరు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెడుతూ పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా నిరసన గళం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు జిల్లా కేంద్రానికి రావాలని పిలుపునివ్వగా, కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా ముందస్తుగా అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుందని, అది తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మధ్యకాలంలో సల్వాయి గ్రామంలో సుక్క రమేష్ అనే యువకుడు ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిజాన్ని నిర్భయంగా సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేస్తూ ప్రశ్నించినందుకు చిత్రహింసలు పెట్టి వేధించి ఆయన ఆత్మహత్యకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులును అరెస్టు చేసి, ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విశారణ జరిపించి దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు, అధికార ప్రతినిధి డర్ర దామోదర్, సీనియర్ నాయకులు వేల్పురి లక్ష్మీనారాయణ, ముడుంబా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర శివాజీ యాదవ్, గడ్డం వివేక్, శాంతమూర్తి యాదవ్, మాజీ సర్పంచులు పూనెం శ్రీదేవి,  సూరిబాబు, యూత్ అధ్యక్షులు నాని, బట్ట నాగేందర్, మాంచర్ల నాగేశ్వరరావు, కొప్పుల మల్లికార్జున్, కొప్పుల వినోద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిట్టిబాబు, బద్ది ఆదినారాయణ, జానకమ్మ, కృపావతి, బౌల్లె రామకృష్ణ, మల్లేష్ ఉన్నారు.