calender_icon.png 8 July, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల చట్టాలకు కత్తెర.. పెట్టుబడిదారులకు పచ్చజెండా..!

07-07-2025 10:28:28 PM

దేశంలో కొనసాగుతున్న మోడీ ప్రభుత్వం దుచ్యర్య పాలన..

సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు..

పెన్ పహాడ్: కార్మికుల న్యాయమైన చట్టాలకు కత్తెర వేసి పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడులకు పచ్చజెండా ఊపడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు(CITU District Secretary Nemmadi Venkateswarlu) ఎద్దేవా చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. మోడీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో దేశాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూల చట్టాలను అమలు చేస్తున్నారని అందులో భాగంగానే పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే 4 లేబర్  కోడ్ లు తెచ్చారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని 10 గంటల  పని చేయాలని తెచ్చిన జీవో నెంబర్ 282ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవో కాపీలను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రణపంగ కృష్ణ  ప్రజాసంఘాల నాయకులు వీరబోయిన రవి, గుంజ వెంకటేశ్వర్లు, .గుర్రం గోపాల్ రెడ్డి, మడ్డి అంజిబాబు, ధనియాకుల శ్రీనివాసు. కొండమీది రాములు, నెమ్మది  పీరయ్య హమాలి, బిల్డింగ్ వర్కర్స్ ఒగ్గు జాను, చిన్నపంగి నాగరాజు, నరసయ్య, దూదియా, జగపతి, రాములు, మట్టయ్య, విజయ్ కుమార్, సైదులు, వీరస్వామి, ఏడుకొండలు, శీను నారాయణ, తదితరులు పాల్గొన్నారు.