calender_icon.png 8 July, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

07-07-2025 10:26:09 PM

వాజేడు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District)లో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు అక్రమాలు ఎక్కువవుతున్నాయని దీనిపై నిరసన కార్యక్రమం జూలై 7 సోమవారం చేపడతామని మండల అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు, ములుగు జిల్లా ఇన్చార్జి బడే నాగజ్యోతి జిల్లా బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చిన విషయం విధితమే. కాగా సోమవారం వాజేడు మండలం నుండి జిల్లా కేంద్రమునకు వెళ్లనున్న బిఆర్ఎస్ నాయకులను స్థానిక ఎస్సై జక్కుల సతీష్ అరెస్టు చేశారు. జిల్లాలో సిటీ పోలీస్ యాక్టు అమలులో ఉందని అదేగాక మంత్రుల పర్యటన జరుగుతున్న నేపథ్యంలో రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు చేపట్ట రాదని తెలియజేశారు.

పోలీసుల అనుమతి లేకుండా ప్రవర్తిస్తే రాజ్యాంగబద్ధంగా శిక్షార్హులవుతారని తెలిపి నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా  నిర్బంధించారు. అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి, వాజేడు మండల యూత్ అధ్యక్షులు ముడిగ తిరుపతిరావు, మండల మాజీ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు గొంది రమణారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చెన్నం సాంబశివరావు, ఎస్టీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యులు తల్లడి వెంకటేశ్వర్లు, వాజేడు గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కల్లూరు సతీష్, మండల నాయకులు చిలకమర్తి శ్రీనివాస్, పెనుమల్ల వెంకటరెడ్డి, మద్దూరి రవి, రానిమేకల పవన్, ములకనూరి జీవన్, కేశబోయిన బాలకృష్ణ ఉన్నారు.