calender_icon.png 8 July, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలీ ఇండియా కవర్ పేజీపై మెరిసిన నభా నటేశ్

07-07-2025 10:21:50 PM

ప్రముఖ మ్యాగజైన్ ఎలీ ఇండియా(Elle India) కవర్ పేజీపై హీరోయిన్ నభా నటేశ్ మెరిసింది. తన జూలై ఎడిషన్‌లో ముఖచిత్ర స్థానంలో నభా నటేశ్ స్టిల్‌ను పబ్లిష్ చేసింది ‘ఎలీ ఇండియా’. 

నభా.. తన పర్‌ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సౌత్ ఇండియన్ సినిమాలో తనదైన ప్రత్యేకతను సంపాదించుకుందని కవర్ పేజీ స్టోరీలో పేర్కొందీ మ్యాగజైన్. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై తన ఫొటో పబ్లిష్ కావడం నభా నటేశ్.. ఇటీవలే ‘స్టుల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’గా ఔట్ లుక్ అవార్డ్ గెల్చుకుంది. 

ఇక నభా సినిమాల విషయానికొస్తే.. తెలుగులో బ్యాక్‌టుబ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తోందీ భామ. నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’లో నభా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోది. అలాగే ‘నాగబంధం’ అనే మరో పాన్ ఇండియా మూవీలోనూ నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులు సైతం నభా చేతిలో ఉన్నాయి.