calender_icon.png 5 July, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సీఎం రోశయ్య, దొడ్డి కొమురయ్యలకు నివాళి

05-07-2025 12:36:41 AM

నిజామాబాద్, జూలై 04 ( విజయ క్రాంతి): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరో లిన్ చింగ్తి యాన్ మావీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి,  కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఇతర అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, బీసీ కుల సంఘాల నాయకులు వర్ధంతి వేడుకలో పాల్గొన్నారు.

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కే.రోశయ్య జయంతి వేడుకలు_ 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు.

రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఇతర అధికారులు, కలెక్టరేట్‌లోని ఉద్యోగులు పాల్గొన్నారు.

కలెక్టరేట్లో..

కామారెడ్డి, జూలై 4 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  శుక్రవారం కలెక్టరేట్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

గవర్నర్ గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ప్రజలకు చేసిన విశేష సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చందర్ నాయక్, విక్టర్, రవికుమార్, టిజిఓ సెక్రటరీ సాయి రెడ్డి, టిఎన్జీవో అధ్యక్షులు వెంకట్ రెడ్డి, సభ్యులు, జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కలెక్టరేట్ ఏవో  సయ్యద్ మసూద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.