calender_icon.png 5 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసవతారకనగర్ పేదలకు అండగా ఉంటాం

05-07-2025 12:35:15 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

శేరిలింగంపల్లి,జూలై 4:శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్లో గౌలిదొడ్డి బసవతారక నగర్లోని సర్వే నెం. 36,37 లోని ప్రభుత్వ భూమిపై గత 30 సంవత్సరాలుగా పేదలు గుడిసెలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధుల ఆదేశాలతో ఈ గుడిసెలు తొలగించిన ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

ఈ విషయంఫై బాధితుల కోరిక ఫై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం రోజు బసవ తారక్ నగర్ ను సందర్శించి మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. స్థానికంగా కబ్జాకు గురైన ఇళ్ల స్థలాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, వారి సమస్యలను అధికారులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జెఏసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్,బిసి పొలిటికల్ జెఏసి సమన్వయకర్త బందారపు నర్సయ్య,బిసి జెఏసి నాయకులు తిరమని నాగరాజు, శేరిలింగంపల్లి నాయకులు అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్,

ముద్దంగుల తిరుపతి, సీనియర్ నాయకులు కృష్ణ, సలహాదారుడు అర్. కే. సాయన్న, మహిళా నాయకురాలు సరోజనమ్మ, సంగమ్మ, లింగంపల్లి అధ్యక్షురాలు అనిత, నాగమణి, విజయలక్ష్మి, పుణ్యమ్మ, సునంద స్థానిక బిసి నాయకులు, ప్రజలు తదితరులుపాల్గొన్నారు.