21-05-2025 10:39:11 PM
తూప్రాన్: మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పండించిన పంటను కాంటపెట్టే క్రమంలో ప్రతిరోజు వర్షం కురవడంతో ఎక్కడి వడ్ల కుప్పలు అక్కడే అన్న చందంగా మారిపోయింది, రైతన్నలు ఆరుగాలం కష్టపడి పంట పండించి చేతికి వచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టగా వరుణుడు కరుణించక నిరంతరం వర్షం కురయడంతో వడ్ల కుప్పలు అతలాకుతులం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు లేక సరైన సమయానికి లారీలు రాక ఎక్కడివి అక్కడే వడ్ల కుప్పలు ఉండిపోవడం, దీనికి తోడు నిరంతరం వర్షం కురవడంతో వడ్లు కొట్టుకుపోవడంతో పాటు నాని మొలకెత్తడం జరుగుతుంది, ఈ దృశ్యాన్ని చూసిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారన్నారు.