21-05-2025 10:33:03 PM
రేపు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని..
వరంగల్/మహబూబాబాద్ (విజయక్రాంతి): అమృత్ భారత్ పథకంలో 25.41 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరించిన వరంగల్ రైల్వే స్టేషన్(Warangal Railway Station)ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. పాత స్టేషన్ స్థానంలో పునరుద్ధరించిన పనుల్లో ప్రధానంగా రైల్వే స్టేషన్ ముఖద్వారం, ఆకృతి కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా లాంజ్ ఏర్పాటు చేశారు. విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్రత్యేకంగా రాంప్ నిర్మించారు. లిఫ్టులు, ఎస్కులేటర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు మెట్లు ఎక్కే ప్రయాస తొలగిపోయింది. రైల్వే స్టేషన్ ముఖద్వారాన్ని ప్రత్యేక ఎలివేషన్ తో ముగ్ద మనోహరంగా తీర్చిదిద్దారు. ఇంచుమించు విమానాశ్రయాలను తలపించే విధంగా రూపొందించిన రైల్వే స్టేషన్ తెలంగాణలో రెండో రాజధానిగా గుర్తింపు పొందిన వరంగల్ కు కొత్తదనాన్ని తెచ్చి పెట్టింది.