21-05-2025 10:35:52 PM
పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం వర్షం దంచికొట్టింది. పటాన్ చెరు పట్టణంతో పాటు రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల వ్యాప్తంగా మధ్యాహ్నం సమయంలో కురిసిన వానతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పటాన్ చెరు, రామచంద్రాపురం జాతీయ రహదారిపై వానకు ట్రాఫిక్ కొంత స్తంభించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. పారిశ్రామికవాడలో రసాయన వ్యర్థాలు వర్షం నీటితో కలిసి సమీప చెరువు, కుంటలో ప్రవహించాయి. వ్యర్థాల విడుదలపై పారిశ్రామిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.