calender_icon.png 22 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు వేసిన అధికారులు

21-05-2025 10:28:57 PM

జుక్కల్ (విజయక్రాంతి): జుక్కల్ మండల కేంద్రంలో ఇద్దరు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం ముగ్గులు వేశామని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన వారికి ఇందిర ఇండ్లు నిర్మించుకోవడానికి ముగ్గులు వేసి, మార్కౌట్ ఇస్తున్నామని చెప్పారు. బంగారుపల్లి, దోస్త్ పల్లి, బస్వాపూర్, పెద్ద ఏడ్గి, పెద్ద గుల్ల, హంగర్గా గ్రామాల్లో ఇప్పటికే కొన్ని ఇండ్లు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేవారు 400 స్క్వేర్ ఫీట్ల నుంచి 600 స్క్వేర్ ఫీట్ లు మించకుండా నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ఇండ్లు నిర్మించుకుంటే బిల్లు వస్తాయని లేకుంటే రావని స్పష్టం చేశారు. పండ్లు జరిగే విధానాన్ని బట్టి ప్రతి సోమవారం వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. ఇల్లు లేని వారు పేదవారు ఇందిరమ్మ ఇండ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.