calender_icon.png 22 May, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా రక్తదాన శిబిరం..

21-05-2025 10:26:33 PM

హనుమకొండ (విజయక్రాంతి): నవ భారత నిర్మాత రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు నేషనల్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉదయ్ భాను చీబు, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ ల ఆదేశాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ఆధ్వర్యంలో సుమారు 60 మందితో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. 

అనంతరం రక్తదానం చేసిన వారిని అభినందించి ప్రశంస పత్రాలను అందజేసిన ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, యూత్ అధ్యక్షుడు. తదనంతరం తలసేమియా వ్యాధితో బాధపడుతు చికిత్స పొందుతున్న వారిని సందర్శించి వారికి మనోధైర్యం కల్పించిన ఎమ్మెల్యే నాగరాజు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యుడు ఈవి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అశ్విన్ రాథోడ్, రమాకాంత్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ నేహాల్, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెవ్వు శివరామకృష్ణ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవుల పవన్ కళ్యాణ్, జిల్లా, మండల, డివిజన్, గ్రామ యూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.