calender_icon.png 30 October, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌కు బంగారు కిరీటం

30-10-2025 01:16:17 AM

త్వరలో దక్షిణ కొరియా ప్రదానం 

సియోల్, అక్టోబర్ 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అరుదైన గౌరవం పొందనున్నారు. దక్షిణ కొరియా ట్రంప్‌నకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వనుంది. దక్షిణ కొరియా అత్యున్నత అవార్డు గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా, చియోన్మాచాంగ్ నకలు ‘బంగారు కిరీటం’ ప్రదానం చేయడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే దక్షిణ కొరియాకు చేరుకున్నారు.

బుధవారం గ్యోంగ్జు నేషనల్ మ్యూజియంను సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ ట్రంప్‌నకు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ బంగారు కిరీటం నకలును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొరియా ద్వీపకల్పంలో సుదీర్ఘకాలం శాంతిని స్థాపించిన సిల్లా చరిత్రకు ప్రతీకగా బంగారు కిరీటాన్ని ఇస్తారని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ప్రపంచ దేశాల్లో శాంతిని నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అత్యున్నత అవార్డును ఆయనకు అందజేస్తున్నట్లు వెల్లడించింది.

కాగా మలేసియా, జపాన్‌లలో పర్యటన ముగించుకున్న ట్రంప్ దక్షిణ కొరియా చేరుకున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో ఆయన ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. అమెరికా విధించిన సుంకాలు, అంతర్జాతీయ పరిస్థితులపైనా వీరు చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లీ జే మ్యుంగ్ అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేకమైన విందును కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.