calender_icon.png 21 September, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంపు.. కంపు!

21-09-2025 12:07:11 AM

గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న కంపు ఇంతాఅంతా కాదు. ఇప్పటకే సుంకాలపై పన్నుల భారాన్ని భారీగా పెంచిన ఆయన తాజాగా హెచ్ వీసాల దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ చర్చకు దారి తీసింది. ఈ మధ్య ట్రంప్ విధానం, ఆయన వ్యాఖ్యలతో అమెరికాకు ఎంత ప్రయోజనం చేకూరుతుందో లేదో తెలియదుగానీ, అమెరికాకు మాత్రం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఆయన తీరుతో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదనే చర్చ జరుగుతోంది.

ఆయన నోటి దురుసు, నిలకడలేని మనస్తత్వం, దూరదృష్టిలేని విధానాలతో అమెరికాపై ప్రభావం పడకమానదు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇతర దేశాలపై పగపట్టినట్లుగా తనకు అనిపించింది చేసేస్తున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నా.. తాను మాత్రం తనకు నచ్చిందే చేస్తానని, అనుకున్నది చెప్తానని.. ఎవరేమనుకున్న ఐ డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థను, సత్సంబంధాలను కంపు కంపు చేసేస్తున్నారనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. అందుకే అంటారు.. ట్రంపు అతడి తీరు కంపు అని.

 రమేశ్ మోతె