calender_icon.png 21 September, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం చెయ్యాలి

21-09-2025 12:08:01 AM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్ , మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం తదితర అంశాలను సమీక్షించారు. ఆయన, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించడం ప్రభుత్వం ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు ప్రతి కేసును పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.