08-09-2025 12:00:00 AM
అశ్వాపురం ,సెప్టెంబర్ 7 ( విజయక్రాంతి): అశ్వాపురం లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో గొందిగూడెం పాతూరు గ్రామంలో ఆదివారం డయాబెటిస్ , బీపీ ఉచిత పరీక్షల క్యాంపు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 7వ రీజియన్ చైర్మన్ శ్రీ సాతులూరి సత్యనారాయణ హాజరయ్యారు.
సుమారు 150 మంది గ్రామస్థులు ఉచితంగా పరీక్షలు చేయించుకున్నారు.డాక్టర్ అజయ్ ప్రకాష్ ఎండి, సిద్ధార్థ వొకేషనల్ కాలేజీ విద్యార్థులు వాలంటీర్లుగా సేవలందించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రెసిడెంట్ ఎన్. సత్య ప్రకాష్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నంబూరి వెంకటేశ్వర్లు, ఇతర సభ్యులుపాల్గొన్నారు.