13-09-2025 03:44:12 AM
ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ జరిపిన అమానుష దాడి ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కాల్పుల విరమణ ఒప్పంద విషయమై దోహాలో సమావేశమైన హమాస్ రాజకీయ బృ ందాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైనిక దాడులకు తెగబడింది. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందారు. హమాస్‌పై దాడి చేయడం ఇజ్రాయెల్‌కు కొత్తేమీ కానప్పటికీ అమెరికాకు మంచి మిత్ర దేశమైన ఖతార్‌ను ల క్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం చూస్తుంటే, హమాస్‌ను అంతమొందించే వరకు ఎవరినీ బేఖాతరు చేయబోమని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లయింది.
ఇజ్రాయెల్ దాడితో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు నిలిచిపోవడమే గాక, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఇజ్రాయెల్ ఘా తుకాన్ని గమనిస్తే.. వారు అన్ని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కినట్టేనని ఖతార్ పేర్కొంది. మిత్రదేశంగా ఉంటూనే తమకు వెన్నుపోటు పొడిచిందని, ఇజ్రాయెల్‌ది పిరికిపంద చర్య అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
వాస్తవానికి రెండేళ్లుగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు ఖతార్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఒప్పందానికి హమాస్‌కు ఇదే చివరి అవకాశమని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో హమాస్ సంస్థ ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైంది. అయితే కా ల్పుల విరమణ తమకు సమ్మతమేనని పైకి చెబుతూనే, మరోపక్క ఖతార్‌లో హమాస్ సంస్థను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు ది గడాన్ని ఐక్యరాజ్యసమితి సహా అరబ్ దేశాలన్నీ హేయమైన చర్యగా అభివర్ణించాయి. ఖతార్ అమెరికాకు అత్యంత సన్నిహిత దేశం. పశ్చిమా సియాలో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ఖతార్‌లోనే ఉంది. ఇటీవల ట్రంప్ ఖతార్‌కు వచ్చినప్పుడు ఆయనకు అత్యంత విలాసవంతమై న బోయింగ్ జెట్ విమానాన్ని కూడా బహుమతిగా సమర్పించుకుంది.
అంతేకాదు లక్ష కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాలు కూడా కు దు ర్చుకుంది. అటు ఇజ్రాయెల్ కూడా ఖతార్‌తో స్నేహంగా మెలుగుతూ నే మరోవైపు వెన్నుపోటు చర్యలకు దిగడం చూస్తే ఆశ్చర్యం కలగక మా న దు. చాలా ఏళ్లుగా సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, యెమెన్‌లలో ఇ జ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించినా గల్ఫ్ దేశాలు మౌనంగా చూస్తూ ఉండిపోయాయి. అయితే గల్ఫ్ దేశాలన్ని కలిసి ఏదో ఒకటి చే యాలని ఇటీవలే ఖతార్ పిలుపునిచ్చింది. అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న ఇజ్రాయెల్ దీనిని తమ వైపునకు తిప్పుకోవాలని పథక రచన చేసింది. అ ందులో భాగంగా ఖతార్‌పై దాడికి దిగినట్టు తెలుస్తోంది.
మధ్యప్రాచ్య దే శాల్లో తానే ప్రధాన కేంద్రంగా ఉండాలని ఇజ్రాయెల్ భా విస్తున్నట్టు కనపడుతుంది. అయితే అది అంత సులభం కాదు. మరోవైపు ఖతార్‌పై దా డిని ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇది సార్వభౌమత్వ ఉల్లంన కిందకు వస్తుందన్నారు. వివాదాలకు చర్చలే పరిష్కారమని, మధ్య ప్రా చ్యంలో శాంతి, సుస్థిరతకు భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. ఖతార్‌పై జరిగిన దాడికి పూర్తి బాధ్యత తమదేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా ప్రకటించారు. రానున్న రోజుల్లో పాలస్తీనా దేశం ఉండబోదని, అదంతా తమ స్థలమని, తిరిగి చేజెక్కించుకుంటామని నెతన్యాహు ప్రతిజ్ఞ చేయడం అతని మూర్ఖత్వాన్ని మరోసారి బయటపెట్టింది.