24-10-2025 12:28:52 AM
రామ్‌చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. 2023, జూన్ 20న ఈ జంటకు తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టగా ‘క్లీన్‌కార’గా నామకరణం చేశారు. ఇప్పుడు వీరి మధ్యకు కవల పిల్లలు రానున్నారు. ఉపాసన త్వరలో ట్విన్స్‌కు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉపా సన ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ‘ఈ దీపావళి మా జీవితంలో డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెసింగ్స్‌తో ఆనందాన్ని రెట్టిం పు చేసింది’ అంటూ ఈ శుభవార్తను పంచుకున్నారామె. ఈ సందర్భంగా ఉపాసన బేబీ షవర్ వేడుక (సీమంతం)ను కుటుంబం, స్నేహితులు, సన్నిహితుల మధ్య నిర్వహించారు. చిరంజీవి, నాగార్జున, వరుణ్‌తేజ్, నాగబాబు, నిహారిక తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.