24-10-2025 12:31:05 AM
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్‌డేట్స్ రావటం అభిమానులకు నిజమైన పండగలా మారింది. ముఖ్యంగా ప్రభాస్ జర్నీకి సంబంధించి ఓ మాషప్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సినిమా అప్‌డేట్స్ సరేసరి! ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్‌కు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అని పేరు పెట్టారు. ఈ టైటిల్, పోస్టర్‌ను చూస్తుంటే ప్రభాస్ సైనికుడి పాత్రను సూచిస్తోంది.
1940 నేపథ్యంలో సాగే ఈ కథలో కాలిపోయిన బ్రిటిష్ జెండా తిరుగుబాటుకు సంకేతంగా కనిపి స్తోంది. చుట్టూ అగ్నిజ్వాలలు, వాటి మధ్య కనిపిస్తున్న సంస్కృత శ్లోకా లు, కోడ్ లాంటి చిహ్నాలు ఈ కథలోని మిథాలజికల్, హిస్టారిక ల్ అంశాలను సూచిస్తున్నాయి. ముఖ్యం గా మహాభారతంలోని కర్ణుడి ప్రతిరూపంగా హీరోను చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో ఉన్న శ్లోకాల భావం గమనిస్తే.. అతను పద్మ వ్యూహాన్ని ఛేదించిన అర్జునుడిలా, పాండవుల పక్షాన నిలిచే ధర్మ యోధుడు. గురువులేని యోధుడు అయిన ఏకలవ్యుడిలా, సహజ సిద్ధమైన శౌర్యం కలవాడు.
బ్రాహ్మణుడి జ్ఞానం, క్షత్రియుడి ధర్మం రెండూ అతనిలో ఉన్నాయి. ‘ఒంటరిగా నడిచే బెటాలియన్’ అనే ట్యాగ్‌లైన్ దేశం కోసం ఒంటరిగా పోరాడే సైనికుడి కథను సూచిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తుండగా అనుపమ్‌ఖేర్, మిథున్‌చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ నిర్వహి స్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీనికి అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్.
‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ వస్తోంది!
ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ మూవీటీమ్ సైతం ప్రభాస్ బర్త్‌డే అభిమానులకు ఓ కలర్‌ఫుల్ పోస్టర్‌తో ట్రీట్ ఇచ్చింది. మేళతాళాలతో ప్రభాస్‌ను ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్నట్టుందీ పోస్టర్. ఇందులో ప్రభాస్ ప్రత్యేకమైన స్వాగ్, స్టైల్‌లో ఆకట్టుకుంటున్నారు. త్వరలో ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. హారర్ కామెడీ జానర్‌లో రూపొం దుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కాగా సంజయ్‌దత్ ముఖ్యపాత్రను పోషిస్తు న్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; ఫైట్స్: రామ్ కింగ్ సోలొమన్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్; నిర్మాత: టీజీ విశ్వప్రసాద్; రచన, దర్శకత్వం: మారుతి.
రంగంలోకి దిగనున్న భైరవ
‘కల్కి 2898ఏడీ’తో వెండితెరపై సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు స్టార్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్. 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూ ళ్లు సాధించింది. ఇక దీని సీక్వెల్ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వైజయంతి మూవీస్ శుభవార్త తెలిపింది. ‘కల్కి’ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. “తదుపరి అధ్యాయం ఎదురు చూస్తోంది. త్వరలో ‘కల్కి’ సెట్స్‌లో కలు ద్దాం” అంటూ ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని విష యాన్ని టీమ్ చెప్పకనే చెప్పింది.