24-10-2025 12:26:43 AM
స్పోర్ట్స్ డ్రామా అనగానే అందరికీ గుర్తుకొచ్చేవి రెగ్యులర్ క్రీడాంశాలే. కానీ, అన్ని వయసుల వారికి ఇష్టమైన పతంగుల పోటీ ఇతివృత్తంగా ఓ కామెడీ స్పోర్ట్స్ డ్రామా రాబోతోందిప్పుడు. ‘పతంగ్’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సినిమాటిక్ ఎలి మెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మిస్తు న్నారు.
ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఇందులో ఇన్‌స్టా సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతోపాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.