calender_icon.png 18 May, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ఐసిస్ సభ్యుల అరెస్ట్

18-05-2025 12:51:06 AM

-ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలు ఉన్నట్టు గుర్తింపు

ముంబై, మే 17: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. ఇండోనేషియా రాజధాని జకా ర్తా నుంచి భారత్‌కు వచ్చిన ఐసిస్ సభ్యు లు అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్‌లుగా గుర్తించినట్టు తెలుస్తోంది.

శుక్ర వారం రాత్రి విమానాశ్రయంలోని రెం డో టెర్మినల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఇమిగ్రేషన్ బ్యూరో అధికారులు అడ్డుకున్నారు. ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలు ఉన్నట్టు గుర్తించినట్టు  వెల్లడించారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం వీరిని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచినట్టు తెలిపారు.

2023లో మహారాష్ట్రలోని పుణెలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడీలు) తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసు లో స్థానిక పోలీసులు వీరిని ఇప్పటికీ గా లిస్తున్నట్టు సమాచారం. అప్పట్లో వీరు భారత్‌లో ఉన్న స్లీపర్ సెల్స్‌తో దేశంలో ఉగ్రకుట్రలకు ప్రణాళికలు రచించినట్టు అధికారులు వెల్లడించారు. అదే ప్రదేశంలో స్లీపర్ సెల్స్‌కు బాంబు తయారీ శిక్షణ వర్క్‌షాప్‌ను నిర్వహించారని అధికారులు తెలిపారు. వారిని పట్టుకోవడా నికి సమచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికీ రూ.3 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది.