06-11-2025 12:07:37 AM
కమ్మర్ పల్లి, నవంబర్ 5 (విజ యక్రాంతి): కమ్మరపల్లి మండలం హాస కొత్తూరు ఉన్నత పాఠశాల చెందిన ప్రతిభ ఆశ్రీత అనే ఇద్దరు విద్యార్థినీలు రాష్ట్ర స్థాయి హాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు అరుణ శ్రీ తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో మంచి ప్రతిభ కనబర్చడంతో సెలెక్టర్ లు ఇద్దరు విద్యార్థినీలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసారని తెలిపారు.
సంగారెడ్డి లో ఈ నెల ఏడు నుండి మూడు రోజుల పాటు జరిగే హాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థినీలతో పాటు శీక్షణ ఇచ్చిన పాఠశాల పి డి మాధురి ని హెచ్ ఎం తో ఉపాధ్యాయులు అభినందించారు.