05-07-2025 12:46:18 AM
మహబూబాబాద్, జూలై 4 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో శుక్రవా రం తెల్లవారుజామున వరంగల్‌ఖమ్మం జా తీయ రహదారిపై మరిపెడ మండలం ఎల్లంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హనుమాన్ జంక్షన్ నుం చి గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చేపల దానా లోడ్‌తో వెళ్తున్న లారీ..
కరీంనగర్ నుంచి కాకినాడకు గ్రానైట్ రాయి లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనగా చెలరేగిన మంటల్లో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో జోద్‌పూర్‌కు చెందిన లారీ డ్రైవర్ శర్వన్ రామ్ చౌదరి(23), క్లీనర్ బర్కత్ అలీ (24), వరంగల్ జిల్లా ఇల్లందకు చెందిన గ్రానైట్ లారీ డ్రైవర్ గణేష్ (30) స జీవ దహనమయ్యారు.
రెండు లారీలు ఢీ కొ న్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఘటన ప్రదేశానికి సమీపంలో ఉన్న ప్రజలు చేరుకొని క్షతగాత్రులను రక్షించేందుకు యత్నిస్తుండగానే డీజిల్ అంటుకొని మంట లు చెలరేగాయి. లారీల క్యాబిన్లలో ఉన్న తమ ను కాపాడడంటూ హాహాకారాలు చేస్తున్నా కాపాడలేని పరిస్థితి ఎదురైంది. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా మరిపెడ నుంచి వారంతా హుటాహుటిన ఘటనస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు చర్యలు చేప ట్టారు.
రెండు లారీలు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లే విధంగా పెద్ద డీజిల్ ట్యాంకుల ను ఏర్పాటు చేయడం వల్ల వం దల లీటర్ల డీజిల్ మంటలకు మరింత ఆజ్యం పోయడంతో మహబూబాబాద్, మరిపెడ అగ్నిమాపక సి బ్బంది సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రెండు లారీలకు చెందిన డ్రైవర్ క్యాబిన్లు పూర్తి గా మంటల్లో మాడి మసైపోయాయి.
గుజరాత్‌కు వెళ్తున్న లారీ గ్రానైట్ లారీని ఢీకొ ట్టడంతో గ్రానైట్ రాళ్లు పూర్తిగా లారీ పైకి దూసుకు వచ్చి ముగ్గురు తీవ్రంగా గాయపడి బయటకు తీయలేని పరిస్థితి నెలకొన్న సమయంలోనే, మంటలు చెలరేగడంతో వారి ప్రాణాలను రక్షించలేకపోయినట్లు సమీప గ్రామాల ప్రజలు తెలిపారు.
ఘటనపై మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, ఎస్సైలు సతీష్, సంతోష్ దర్యాప్తు చేపట్టారు. గుజరాత్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి రోడ్డు క్రాస్ చేసి గ్రానైట్ లారీని ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి కళ్లెదుటే కొడుకు సజీవ దహనం
రాజస్థాన్‌కు చెందిన తండ్రీకొడుకులు రాజు రామ్ చౌదరి, శర్వన్ రామ్ చౌదరి వేర్వేరుగా రెండు లారీల్లో హనుమాన్ జంక్షన్ నుంచి సూరత్‌కు చేపల దానాతో వెళ్తున్నారు. కొడుకు శర్వన్ రామ్ నడుపుతున్న లారీ ముందు వెళ్తుండగా, తండ్రి రాజు రామ్ చౌదరి నడుపుతున్న లారీ వెనక వస్తోంది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందే తండ్రి కొడుక్కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వెళ్లా వు అని అడగగా, నీకంటే కొంత ముందు వెళ్తున్నానని సమాధానం ఇచ్చాడు.
ఘటన స్థలిలోనే పోస్టుమార్టం
మూడు మృతదేహాలకు ఘటనస్థలిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తిగా కాలిపోవడంతో పోస్టుమార్టం కోసం మహబూ బాబాద్ తరలించే పరిస్థితి లేకపోవడం వల్ల ఘటనస్థలిలోనే పోస్టుమార్టం నిర్వహించాల్సి వచ్చిందని ఎస్సై సతీష్ తెలిపారు.