calender_icon.png 5 July, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవోపేతంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం

05-07-2025 12:47:02 AM

భక్తి పరవశంతో రథయాత్రలో పాల్గొన్న భక్తులు 

నిజామాబాద్ జూలై 4:(విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలో అత్యంత వైభవ్వేత్తంగా జగన్నాథ రథయాత్ర కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం ఈశ్వర్ నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర టీఎన్జీవో చౌరస్తా రైల్వే స్టేషన్ గాంధీ చౌక్ శివాజీ నగర్ చౌరస్తా మీదుగా కులం చేరుకొని అక్కడి నుండి వినాయక నగర్ వరకు కొనసాగింది. ఈ రథయాత్రను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు.

నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి జగన్నాథ స్వామి భక్తులు గంధ తిలకం ధరించి స్వామివారి నామాలను స్మరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో రథయాత్రలో పాల్గొన్నారు. కనుల పండువ గా సాగిన ఈ రథయాత్రలో చిన్న పిల్లలు మొదలుకొని మహిళలు వృద్ధులు యువకులు యువకులు, అత్యంత భక్తిశ్రద్ధలతో నామస్వరన చేస్తూ భజనలు చేస్తూ జగన్నాథ స్వామివారి రథాన్ని ఇరువైపుల కట్టిన తాడుతో లాగుతూ రథయాత్ర కొనసాగింది.

అందరికీ దారి పొడవునా ఇస్కాన్ సంస్థ వారు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. రథయాత్ర దారి పొడవునా నగరవాస్తులు కన్నుల పండుగ చూస్తూ ఉండిపోయారు. రథయాత్ర సాగి రోడ్డు మార్గంలో  రంగురంగుల ముగ్గులతో ప్రత్యేకంగా రోడ్లను తీర్చిదిద్దారు. నగర ప్రజలను అత్యంత గా ఆకట్టుకున్న ఈ రథయాత్రలో నగరవాసులు అన్ని వర్గాల ప్రజలతో పాటు విదేశీయులు కూడా పాల్గొనడం విశేషం.

విదేశీయులు స్వామివారికి భజన చేయడం అగరవాసు లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానంద ప్రభు రాయి దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర శుక్రవారం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్, అసిస్టెంట్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ కర్ర వెంకట శివకుమార్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాదాసు స్వామి యాదవ్,  ఇస్కాన్ అంతర్జాతీయ ఉపన్యాసకులు ప్రణవానంద దాసు పాల్గొన్నారు.