calender_icon.png 13 December, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ్ముడి ఓటమి తట్టుకోలేక అక్క మృతి

13-12-2025 01:45:26 AM

  1. సర్పంచ్‌గా పోటీ చేసిన సోదరుడు 
  2. గంభీర్ పూర్ గ్రామంలో విషాదం

కోరుట్ల, డిసెంబర్ 12(విజయకాంతి): పంచాయతీ ఎన్నికల్లో తమ్ముడి ఓటమి తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కృష్ణ మండల కేంద్రానికి చెందిన కొక్కుల మమత (38) ప్రస్తుతం కోరుట్లలో ఉంటున్నారు.తన పుట్టినిల్లు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని గంభీర్‌ఫూర్ గ్రామంలో సోదరుడు పోతు రాజశేఖర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

తమ్ముడికి మద్దతుగా ఉండేందుకు మమత గ్రామానికి వచ్చారు. అయితే గురువారం వెలువడిన ఫలితాల్లో తమ్ముడు రాజశేఖర్ ఓటమి చెందడంతో మమత కలత చెందింది. ఈ క్రమంలో ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో కోరుట్లలోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్థారించారు. కాగా మమత భర్త ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లాడు. మృతురాలికి బిడ్డ, కొడుకు ఉన్నారు.