29-10-2025 01:17:29 AM
మూడేళ్ల వ్యవధిలో రెండోసారి ఏసీబీ దాడులు
ములకలపల్లి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్ల నుంచి రెవెన్యూ వ్యవస్థ లో పేరుకుపోయిన అవినీతి తీరు మాత్రం మారడం లేదు. దీనికి ఉదాహరణగా సోమవారం రెవెన్యూ గ్రామ పాలనాధికారి ము లకలపల్లి లో ఏసీబీకి పట్టుబడిన అంశం తే డా తెల్లం చేస్తోంది. రెవెన్యూలో కిందిస్థాయి లో అవినీతికి మూల స్తంభంగా మారిన విఆర్‌ఓ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు అయిన వీఆర్వో వ్యవస్థను గ్రామ పా లన అధికార వ్యవస్థ( జిపిఏ)గా మార్చి నెలన్నర క్రితమే వారిని నియమించింది.
ఇంత లోనే ఇక్కడి పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ గ్రామ పాలన అధికారిగా పనిచేస్తున్న బానో తు శ్రీనివాస్ రిజిస్ట్రేషన్, పట్టాపాస్ బుక్ కోసం రైతు నుంచిరూ 60వేలు డిమాండ్ చేసి, రూ40 వేలు తీసుకొని మిగతా రూ 20వేలు ఇచ్చే క్రమంలో రూ 15వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం విధిత మే. సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రే పింది. ఈ దాడితో ములకలపల్లి తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి. మూడేళ్ల క్రితం ఇదే మండలంలోని పొగళ్ళపల్లి గ్రామానికి చెంది న సాధం శ్రీనివాస్ తన కుమార్తె చదువు కో సం అవసరమైన మున్నూరు కాపు కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు. కుల సర్టిఫి కెట్ జారీ కోసం ఇదే కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వ్యక్తి పది వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
మూడేళ్ల వ్యవధిలో ములకలపల్లి తాసిల్దార్ కార్యాలయం పై రెండుసార్లు ఏసీబీ దాడులు నిర్వ హించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూర్తిగా గిరిజన ప్రాంతం. గిరిజన జనాభా అధికం. నిరక్షరాస్యత ఎక్కువ. ఇలాంటి ప్రాంతం నుంచే ప్రజ లు ఏసీబీ ని ఆశ్రయిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవ చ్చుకుల, ఆదాయ ధ్రువపత్రాల నుంచి ప్ర భుత్వం అందించే వివిధ రకాల ప్రభుత్వ పథకాల ఆర్థిక సాయం కోసం అవసరమైన ప త్రాలు మొదలుకొని పహాని, వారసత్వ పేర్ల మార్పు, భూముల పార్టిషన్, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాసు పు స్తకాల వరకు అధికారులకు ముడుపులు ఇ వ్వనిదే పనులు కావట్లేదని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
దీనికి తోడు ఇసుక, మట్టి మాఫియా తోడైంది. అక్రమార్కులు అధికారులను మచ్చిగా చేసుకుని దందాను కొనసాగిస్తున్నారు. అక్రమాలను, అన్యాయాన్ని, దోపిడీని, అక్రమ వసూళ్లను అరిక ట్టాల్సిన అధికారులే అడ్డదారులు తొక్కుతుండడంతో అవినీతి విస్తృతంగా ప్రబలడానికి కారణమవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారుల ను కేసులు, సస్పెన్షన్లతో సరిపెట్టకుండా సర్వీస్ నుంచి తొలగించాలని ప్రజలు డి మాండ్ చేస్తున్నారు.