29-10-2025 01:16:27 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రాజకీయాలకతీతంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించుకుని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనుల కోసం రాష్ట్రంలోనే అత్యధికంగా రు.62.50 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, సహకరించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెం టనే నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జగిత్యాల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నిధులు మంజూరు చేయాలని కోరిన వెంటనే అదే రోజు నిధులు కేటాయించేందుకు ఉత్తర్వు లు జారీ చేశారని తెలిపారు. రు.32 కోట్ల ని ధులతో నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు.
అమృత పథకం ద్వారా తా గునీటి సౌకర్యాన్ని కల్పించడంతోపాటు గ తంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను సై తం పూర్తిచేసేందుకు నిధులను మంజూరు చే యించడం జరిగిందన్నారు. నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగిందని, దీం తో అర్బన్ హౌసింగ్ కాలనీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాక కాంట్రాక్టర్లు కొత్త పనులు చేసేందుకు నిరాకరిస్తే తాను ముఖ్యమంత్రిని కోరిన వెంటనే సుమారు రు. 68 కోట్ల నిధులు మంజూరు చేశారని దీనితో పట్టణంలో కొత్త అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయన్నారు. గతంలో జగిత్యాల మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తీసు కువస్తే డ్రాఫ్ట్ సమయంలోనే కొంతమంది రాజకీయం చేయడం వల్ల అది రద్దయిందని తెలిపారు.
ప్రస్తుతం రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త మాస్టర్ ప్లాన్ కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల ప్రజల చిరకా ల వాంఛ అయిన యావర్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందని, ము ఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలోనే యావర్ రోడ్డు విస్తరణ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
నాయకులు రా బోయే ఎలక్షన్ల కోసం కాకుండా రాబోయే తరం కోసం ఆలోచన చేయాలన్నారు. జగిత్యాల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి పని చేస్తున్న తనకు అన్ని విధాల సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల పట్టణం లో ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా ఊరుకునేది లేదని, అధికారులు తగిన రీతిలో స్పందించాలని సూచించారు.ఈ స మావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం ఆడవాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు, నాయకులు బా లేశంకర్, అనిల్, రాజకుమార్, జగన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.