calender_icon.png 30 July, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు అనూహ్య స్పందన

30-07-2025 01:37:02 AM

  1. బండ్లగూడ, పోచారంలోని ప్లాట్లకు వందలాది మంది దరఖాస్తు 
  2. నేడు బండ్లగూడ ఫ్లాట్లకు లాటరీ 

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వ ర్యంలోని ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజలు ఉత్సా హం చూపుతున్నారు. మంచి సదుపాయాలతో నిర్మించిన వీటిని కొనుగోలు చేయడా నికి ప్రజలు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. నాగోల్‌లోని బండ్లగూడ ప్రాజెక్టు లోని 159 ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు మంగళవారం చివరిరోజు కావడంలో వందలాది మంది డీడీలతో క్యూ కట్టారు. 

బండ్ల గూడ, పోచారంలో ఫ్లాట్ల కోసం సుమారు 1,900 మందికి పైగా అప్లు చేశారు. ఇందు లో చివరిరోజైన మంగళవారమే 600కు పైగా దరఖాస్తులు రావడం విశేషం. గతంలో మాదిరిగా కాకుండా, లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆ ఫ్లాట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీలో వచ్చిన వారికి కేటాయిస్తారు. ఈ కేటా యింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని బుధవారం ఉదయం బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించనున్నారు. 

పోచారం ప్రాజెక్టుకు రేపటి వరకు దరఖాస్తులు..  

ఘట్‌కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల విక్రయానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఈ నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. నోలాస్, నో ప్రాఫిట్ బేసిస్‌లో(లాభాపేక్ష లేకుండా) నిర్మాణానికి అయిన వ్యయంతోనే వీటిని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో ఇవి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చాయి. పోచారం ప్రాంతంలో సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ ధర కేవలం రూ.13 లక్షలు కాగా, 2 బీహెచ్‌కే రూ.19లక్షల్లోనే అందుబాటులోకి ఉన్నది. ఈ ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుండగా లాటరీ ప్రక్రియ ఆగస్టు 1,2 తేదీల్లో నిర్వహించనున్నారు. 

పోచారం ప్రాజెక్టుకు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీ రానివారు, పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకో వచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్  వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బండ్లగూడలో ప్రాజెక్టులో ఈఎం డీ చెల్లించినట్లు ఇచ్చిన రశీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అక్కడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

అలా గే రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూరు, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడా ప్రాంతాల్లోని ఆగస్టు 4,5,6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలంపాటలో పాల్గొనడానికి, బండ్లగూడలో పొందిన రశీదుతోనే పాల్గొనవచ్చని వివరించారు. 

 వీపీ గౌతమ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ