calender_icon.png 9 August, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

09-08-2025 02:08:36 AM

ఎల్లారెడ్డి ఆగస్టు 8,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలం జంగమయ్యపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు.

చాలా మంది నిరుపేదలు త్వరగా ఇల్లు నిర్మిం చడానికి ఉత్సాహంగా ఉన్నారని ఆయన తెలి పారు. ఇళ్లను నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులు వచ్చే విధంగా చూస్తామని అన్నారు. అనంతరం మత్తమాల పీహెచ్ సి ని పరిశీలించిన ఆర్డీవో& ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల పీహెచ్ సి ని ఆర్డిఓ పార్థ సింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాలు.. అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యుడు ని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని రికార్డులు.. మందులను పరిశీలించారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో ప్రకాష్, కాంగ్రెస్ నాయకుడు,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి  పాల్గొన్నారు.