calender_icon.png 9 August, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డదారులు.. అరచేతిలో ప్రాణాలు

09-08-2025 12:08:37 AM

  1. మహబూబ్‌నగర్ బైపాస్‌లో ఇష్టారీతిగా డైవర్షన్లు
  2. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ ఏది..?
  3. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా..? 
  4. ఎక్కడ అనధికారికంగా దారులు ఉన్నాయో పరిశీలిస్తాం : శ్రీనివాసులు, ట్రాఫిక్ సిఐ, మహబూబ్ నగర్ 

మహబూబ్‌నగర్ ఆగస్టు 8 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి అనుసంధానంగా మహబూబ్నగర్ - భూ త్పూర్ రోడ్డుకు అనుసంధానంగా బైపాస్ ను ఏర్పాటు చేశారు. బైపాస్ లో రెండు చో ట్ల డైవర్షన్లు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా రెండు డైవర్షన్లను ఉపయోగించకుండా ఇస్టారీతిగా బైపాస్ రోడ్డును తొలగించి డైవర్షన్లు ఏర్పాటు చేసుకుని అడ్డదారుల్లో వెళ్తూ ప్రణాల మీద కు తెచ్చు కుంటున్నారు. 

అనుమతి లేని చోట ఐదు చోట్ల డైవర్షన్లు..

మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు పిస్తా హౌస్ నుంచి మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్ ప్రధాన రహదారికి అనుసంధానంగా 5 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్డులో ఏదిరా క్రాస్ రోడ్ వద్ద, పాలకొండ క్రాస్ రోడ్ వద్ద డైవర్షన్లు, యూటర్న్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. కాగా ఐదు కిలోమీటర్ల పొడవు నా ఐదుచోట్ల బైపాస్ రోడ్డును మధ్యగా తొలగించి యూటర్న్ చేసుకోవడానికి ఏర్పా టు చేసుకున్నారు.

చుట్టుపక్కల గ్రామాల వా ళ్లు పొలాలవారు నిత్యం ఈ దారి వెంట వెళ్లేవారు ఇలా వెసులుబాటు చేసుకున్నట్లు తె లుస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతున్నది. డైవర్షన్ యూ టర్న్ లేని చోట అనధికారికంగా ఎవరు ఇష్టమొచ్చిన ట్లు వారు రోడ్డును తలచి యూటర్న్ ఏర్పా టు చేసుకోవడంతో అటువైపుగా వచ్చే వా హనాల వారికి చాలా ఇబ్బందిగా మారి ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ప్రతి వా రంలో సుమారు ఒకటి రెండు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతు న్నా అధికారులు మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరించడం గమనించాల్సిన విషయం. 

పోలీసుల పర్యవేక్షణ ఏది..? 

మహబూబ్నగర్ బైపాస్ రోడ్డులో తర చూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బైపాస్ రోడ్డులో అడ్డదారులు ఏర్పాటు చేయడమే.. బైపాస్ కావడంతో సహజంగానే వాహనాలు వేగం గా వెళుతుంటాయి. అయితే పెద్ద వాహనా లు రాత్రిళ్ళు అడ్డదారుల్లో డైవర్షన్ చేయడం వల్ల ప్రధానంగా ప్రమాదాలు జరుగుతున్నా యి.

బైపాస్ రోడ్డు వెంట పోలీసు అధికారు లు కానీ , రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు కానీ పర్యవేక్షించడం లేదు. పోలీసు అధికారులు కొన్ని రోజులపాటు ప్ర త్యేక డ్రైవ్ నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించాల్సి ఉన్నది. ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో అనధికారికంగా రోడ్డును తొలగించి ఏర్పాటు చే సుకున్న యూటర్న్, డైవర్షన్లను మూసివేయాలని వాహనదారులు కోరుతున్నారు.

ఎక్కడ అనధికారికంగా దారులు ఉన్నాయో పరిశీలిస్తాం  

పిస్తా హౌస్ నుంచి భూత్పూర్ రోడ్డు వరకు ఉన్న బైపాస్ రోడ్డు మార్గంలో ఎగిరే రోడ్డు దగ్గర, పాలకొండ దగ్గర మాత్రమే డైవర్షన్లు ఉన్నాయి. అవి కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా డైవర్షన్లు ఉంటే కచ్చితంగా మూయిస్తాం. వాహన దారులకు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కావాలని అలా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పూర్తిస్థాయిలో పరిశీలించి ఎవరు చేశారు ఎందుకు చేయవలసి వచ్చిందని విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతాం. 

శ్రీనివాసులు, ట్రాఫిక్ సిఐ, మహబూబ్ నగర్