calender_icon.png 27 December, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ కుంటలో గుర్తుతెలియని మృతదేహం

06-10-2024 03:44:09 PM

హుజురాబాద్, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని ఇల్లందుకుంట మండలంలోని బూజునూరు గ్రామంలోగుర్తుతెలియరని మృతదేహం లభ్యమైనది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుజునూరు గ్రామంలోని బతుకమ్మ కుంటలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి పోలీసులుచేరుకొని. మృతదేహాన్ని గ్రామస్తుల సహాయంతో బయటకు తీశారు సుమారు 35 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉంటాడని, మృతుడి ఒంటిపై బ్లూ కలర్ వైట్ లైన్స్ ఫుల్ టీ షర్ట్, బ్లాక్ కలర్ పయింట్ ధరించాడని తెలిపారు. మృతుడి వివరాలు తెలియ రాలేదని పోలీసులు తెలిపారు. ఈ మృతిచెందిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెల్సినచో ఇల్లందకుంట ఎస్సై సెల్ : 8712670778 కి సమచారం ఇవ్వాలని ఆయనకోరారు.