calender_icon.png 6 December, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో సాధనకు ఐక్య ఉద్యమం

06-12-2025 12:00:00 AM

మహబూబాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రైల్వే శాఖ ద్వారా మంజూరైన రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో నిర్మాణం మహబూబాబాద్ జిల్లాలోనే నిర్మించాలంటూ, ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలని, ఇందుకోసం ఐక్య ఉద్యమానికి సన్నద్ధం కావాలని వివిధ సంఘాలు, పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఈ మేరకు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, కుల, విద్యార్థి, ఉద్యోగ సంఘాల ఆద్వర్యంలో గంగపుత్ర భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ, పార్టీ, కుల ప్రజా, విద్యార్ధి, మహిళ సంఘ నేతలు డోలి సత్యనారాయణ, మైస శ్రీనివాసులు, ఎడ్ల రమేష్, మార్నేని వెంకన్న, సమ్మెట రాజమౌళి, రేషపల్లి నవీన్, గుజ్జు దేవేందర్, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ, పిల్లి సుధాకర్, కొండ్ర ఎల్లయ్య, భీమా నాయక్ తదితరులు మాట్లాడుతూ.

రైల్వే శాఖ ద్వారా మంజూరైన రైల్వే మెగా మెయిన్ టెనన్స్ డిపో నిర్మాణం మానుకోట లో నిర్మించుటకు ప్రాజెక్ట్ ను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాన్ని నిలుపుదల చేయించుటకు అందరం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, ఉద్యమాల ద్వారనే రైల్వే ప్రాజెక్ట్ ను సాదించగలమని, వెనుకబడిన జిల్లా అయిన మనకు ఈ మెగా డిపో ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే పరిస్థితి ఉన్నదన్నారు.రాజకీయాలు పక్కకు పెట్టి కలిసొచ్చే అన్ని శక్తులతో ఈ ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. ఈ సమావేశంలోమామిడాల సత్యనారాయణ, ఎండి. ఖలీల్, భీమా నాయక్, ఇక్బాల్, ఫరీద్, బాలస్టీ రమేష్, ఇనుగుర్తి మణెమ్మ, దుగ్గి గోపాల్, రాంచందర్, యాకయ్య,రజియా, చిత్తరి సోమన్న, పిడుగు మనోజ్, రావుల సమ్మయ్య, పట్టాభి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

రైల్వే మెగా మైంటెనెయన్స్ డిపో సాధన కమిటీని ఏర్ఫాటు: కన్వీనర్ గా డోలి సత్యనారాయణ, కో ఆర్డినేటర్ గా మైస శ్రీనివాసులు, కో కన్వీనర్లుగా గుగ్గిళ్ల పీరయ్య, పిల్లి సుధాకర్, కొండ్ర ఎల్లయ్య,మహ్మద్ ఫరీద్,గుజ్జు దేవేందర్, అన్ని పార్టీల ప్రతినిధులుకోకన్వీనర్లుగా ఉంటారన్నారు.