calender_icon.png 13 September, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా వలంటీర్లను నియమించాలి

13-09-2025 03:42:01 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లను నియమించాల్సిన అవసరముంది. విద్యా ప్రమాణాలు పెరిగితేనే ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరగనుంది. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చే యడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా పాఠశాలల పున: ప్రారంభించే నాటికి విద్యా వలంటీర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు అర్హత కలిగిన వా రిని విద్యా వలంటీర్లుగా నియమించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం మళ్లీ విద్యా వలంటీర్లను నియమిస్తామని ప్రకటించడ ంతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రా లేదు. పదోన్నతుల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ అయిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులు భర్తీ చేసే వరకు విద్యా వలంటీర్లను నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.

 నరేష్ కుమార్, గజ్వేల్

పోటీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో నాన్-గెజిటెడ్, నాన్- టెక్నికల్ పోస్టులకు నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం లక్ష లాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. కానీ కొన్ని సంవత్సరాలుగా, నియామక పరీక్షల్లో జరుగుతున్న అక్రమా ల కారణంగా విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 1 మధ్య 2,423 పోస్టులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష నిర్వహించింది. పరీక్ష నిర్వహణపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదని, ఇంకొన్ని చోట్ల అ భ్యర్థులు ఎంతో దూరం ప్రయాణం చేసి పరీక్షా కేంద్రానికి చేరుకున్న తర్వాత సాంకేతిక సమస్యతో ఎగ్జామ్ రద్దయిందని చెప్పి వె నక్కి పంపించారు.  మిగతా పరీక్ష కేంద్రాల్లో క ంప్యూటర్ సర్వర్ వ్యవస్థ క్రాష్ అయిందన్నారు. కొన్నిచోట్ల బయోమెట్రిక్ వ్యవస్థ స రిగ్గా పనిచేయలేదు.

అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అభ్యర్థులు ఆందోళన చేయడానికి ప్రయత్నించగా.. బౌన్సర్లను పెట్టి దౌర్జన్య ంగా పంపించేశారు. పరీక్షలను నిర్వహించే బాధ్యతను అప్పగించి న ప్రైవేట్ కంపెనీలకు పరీక్షల నిర్వహణ అప్పగించి వేలాది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. నియామక పరీక్షలకు సంబంధించి పదే పదే మోసాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉంటుంది. ఇప్పటికైనా ప్ర భుత్వం తమ బాధ్యతను గుర్తించి.. ఉద్యోగ పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నాం.

                                  వేణు మాధవ్, హైదరాబాద్