calender_icon.png 14 May, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విభేదాల్లేవ్..

14-05-2025 12:36:09 AM

-పార్టీ అధినేత ఆదేశాలు శిరసావహిస్తా

- కేటీఆర్‌కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తా

- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు శిరసావహిస్తానని, కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే సహకరిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు హరీశ్‌రావు బదులిచ్చారు. తమ పార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని, కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు.

కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని, సహకరిస్తానని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని జవదాటబోను అని వెల్లడించారు. అనేకసార్లు ఈ అంశంపై స్పష్టత ఇచ్చానని గుర్తుచేశారు. గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నానని, పార్టీ మారుతానని జరుగుతున్న అసత్య వార్తలను, చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని హితవు పలికారు.