calender_icon.png 12 September, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీతమో మహాప్రభూ!

12-09-2025 12:00:00 AM

-ఆరు నెలలుగా వేతనం రాలే

-ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వెతలు 

-అడిగినా పట్టించుకోని అధికారులు 

-నిత్యావసరాలకు అప్పులే దిక్కని ఆవేదన

కామారెడ్డి, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగు లకు వేతనాలు చెల్లించక కటకట నడుస్తుంది. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి వేతనాలు నెలనెలా చెల్లించడం లేదు.

కస్తూర్బా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, జిల్లా పంచాయతీ కార్యాల యంలో అవుట్సోర్సింగ్ పై పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగులకు నెలసరి వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం వల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు వేత నాలు చెల్లించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

కామారెడ్డి జిల్లాలో అన్ని శాఖలలో 5000 మంది ఔట్సోర్సింగ్, కాం ట్రాక్ట్ పద్ధతిలో తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగా పనులు చేస్తున్న కూడా కనీస వేతనాలు మాత్రం సకాలంలో అందడం లేదు. కుటుంబ పోషణకు, పిల్లల స్కూల్ ఫీజులకు, అత్యవసర వైద్య ఖర్చులకు డ బ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తుంది అని ఔట్సోర్సింగ్, కాం ట్రాక్టు ఉద్యోగులు విజయ క్రాంతి ప్రతినిధితో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వేతనాలు సకాలంలో రాకపోవడంతో నిత్యవసర సరుకులు కొనేందుకు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది అని ఉద్యోగులు వాపోయారు.

ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి వేతనాలు నెల నెల విడుదల చేయాలని కోరుతున్నారు. వైద్య శాఖలో ఔట్సోర్సింగ్ పై పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కారో బార్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచే స్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హాయం లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు నెలసరి వేతనాలు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాల కటకట మొదలైందని ఉద్యోగులు వాపోతున్నా రు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచి నెల నెల వేతనాలు చెల్లించాల ని కోరుతున్నారు. ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం చేస్తే తమ కుటుంబాలతో రోడ్డు పైకి వచ్చి తమ కుటుంబా లతో రోడ్డు పైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి యూనియన్ నేతలు తీసుకువె ళ్లిన హామీ ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు.

కస్తూర్బా, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నిత్యం 12 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం అమలు చేయడం లేదు. ప్రభుత్వమే నిలువు దోపిడికి గురిచేస్తుంది. కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలంటూ నాన్ టీచింగ్ సిబ్బందిపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వం కొత్త మెనూ ప్రకటించినప్పటికీ నాన్ టీచింగ్ సిబ్బందికి మాత్రం వేతనాలు పెంచలేదు. కనీసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘం, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  టీచింగ్, నాన్ టీచింగ్ ఉపాధ్యాయులతో పాటు సిబ్బందికి వేతనాలు పెంచాలని కోరుతున్నారు. ప్రతినెల వేతనాలు అందజేసి కుటుంబాలకు చేదోడు వాదాడుగా హార్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా సహకరించాలని ప్రభుత్వ ఉన్నతాధికాలను కోరుతున్నారు.