calender_icon.png 16 August, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరత.. రైతుల ధర్నా

13-08-2025 12:00:00 AM

ముస్తాబాద్, ఆగస్టు 12(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా లో ముస్తాబాద్ మం డల కేంద్రంలో యూరియా కొరత తీర్చాలని రైతులు ధర్నా నిర్వహించారు. కొత్త బస్టాప్ చౌరస్తా వద్ద రైతులు యూరియా కొరతపై ధర్నా రాస్తారోక నిరసన చేపట్టిన కార్యక్రమానికి బిఆర్‌ఎస్ యువజన నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన యూరియా కొరత ఏర్పడిందని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వం వెంటనేరైతులకు సకాలంలో సరిపడే ఎక్కువ మోతాదులో యూరియా అం దించాలని డిమాండ్ చేశారు.బిఆర్‌ఎస్ నా యకులు మనోహర్, స్వామి మాట్లాడుతూ రైతుల కష్టం తెలిసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ప్రతి రైతుకు సరిపోయే విధంగా యూరియా ను సరఫరా చేసి రైతులకు అండగా నిలిచారని పేర్కొన్నారు.సంబంధిత వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని రైతులకు యూరి యా సరఫరా ను సకాలంలో అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నాయ కులు తదితరులుపాల్గొన్నారు.