13-08-2025 12:00:00 AM
ముగ్గురు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు
కరీంనగర్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు ము మ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయి న నేపథ్యంలో నామినేటెడ్ పదవులను పూ ర్తిస్థాయిలో భర్తీ చేస్తారనే ఆశాభావం నాయకుల్లో ఉంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమ యాల్లో టిక్కెట్లకు పోటీపడి నాడు అధిష్టానం హామీ మేరకు ఉపసంహరించుకున్న నేతల్లో కొందరికి పదవులు దక్కాయి.
చాలామంది నేతల్లో వారికిచ్చిన హామీని నెరవే ర్చుతారనే నమ్మకంతో ఉన్నారు. రాష్ట్ర స్థా యి కార్పొరేషన్ చైర్మన్ల కోసం కీలకమైన కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులతోపాటు, కీలకమైన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కో సం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఎవరికి పదవీయోగం కలుగు తుందనేది ఆసక్తిగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భర్తీ ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ల చుట్టూ ఆ శావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లో క్సభ ఎన్నికలకు ముందు తొలిదశలో రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు పాలకమండళ్లను ని యమించింది.
ఉమ్మడి జిల్లా నుంచి మ హిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారద, ప్ర భుత్వ సలహాదారుగా అర్కాల వేణుగోపాల్, వక్స్బర్డు చైర్మన్ గా అహ్మద్ పాషా, సుడా చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితోపాటు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి గ్రంథాల య సంస్థ చైర్మన్లను నియమించారు. మొ త్తం ఏడుగురికి పదవులు దక్కాయి.
జిల్లాలోని అందరు నాయకులతో సమన్వయం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండడం, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలో గత పదేళ్లుగా అధికారంలో లేకపోయినా పార్టీని నమ్ముకుని ఉం డడంతోపాటు అదేవిధంగా అభ్యర్థుల విజ యం కోసం శ్రమించిన నాయకులు, బీసీ వర్గాల నుండి ప్రాధాన్యత లభిస్తుందని ఆశిస్తున్నారు. ఇటీవల జిల్లా ఇంచార్జి అద్దంకి దయాకర్ నియోజకవర్గాల వారీగా సమావేశమై నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి పేర్లను సేకరించిరు.
నియోజకవర్గానికి ఇద్దరి పేర్ల చొప్పున సీల్ కవర్ను పీసీసీ అధ్యక్షుడితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనా క్షి నటరాజ్, సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు. రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులు ఆశిస్తు న్నవారిలో మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మో హన్, బీసీ నాయకుడు వైద్యుల అంజన్ కు మార్, హుజూరాబాద్ నుండి పత్తి కృష్ణారెడ్డి, వేములవాడ నుంచి మనోహర్ రెడ్డి, సి రిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డిలు ఉన్నారు.
రాష్ట్రస్థాయి డైరెక్టర్ స్థానా లు ఆశిస్తున్నవారిలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, మాజీ కార్పొరేటర్ అర్ష కిరణ్మయితోపాటు ప్రస్తుత డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్టీ నాయకులు ఈశ్వర్ గౌడ్, పులి ఆంజనేయు లు గౌడ్, సుజిత్ కుమార్, అరుణ్ తోపాటు పలువురు ఉన్నారు. సీల్ కవర్లో ఎవరి పేర్లు ఉన్నాయో, మంత్రులు ఎవరి పేర్లు సూచిస్తున్నారో నామినేటెడ్ పదవుల భర్తీ అనంతరం తేలనుంది.వివాదాలకు తావులేకుండా పో స్టులు భర్తీ చేయాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లుతెలిసింది.