calender_icon.png 4 September, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడలో యూరియా కొరత

01-09-2025 11:30:43 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో యూరియా కోసం రైతన్నలు ఉదయం నుంచి భారీగా క్యూ కట్టారు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రైతన్నలు వేడుకుంటున్నారు. వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో పలు ఫర్టిలైజర్ షాప్ లో వద్ద రైతన్నలు క్యూలైన్లో గంటల తరబడి యూరియా కోసం వేచి చూసిన సందర్భం కనబడింది. వేములవాడ పట్టణ, రూరల్ రైతులు క్యూ లైన్ లో ఉండి నీరసపడిన మహిళా రైతులకు బీఆర్ఎస్ శ్రేణులు వాటర్ బాటిల్స్ అందించి రైతులకు సంఘీభావంగా రైతుల పక్షాన, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేశారు.

సంఘటన స్థలానికి వేములవాడ పట్టణ పోలీసులు చేరుకొని బిఆర్సీ శ్రేణులను సముదాయించారు. ఈ ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నిమశెట్టి  విజయ్, మాజీ వేములవాడ సెక్స్ డైరెక్టర్ రామతీర్థపు రాజులు మాట్లాడుతూ రైతులకు ఇందిరమ్మ రాజ్యం తెస్తానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఏ గోసపడ్డారో ఆ విధంగానే నీళ్ల కోసం, కరెంటు కోసం, ఇప్పుడు యూరియా కోసం ఆనాటి రోజులు తెచ్చాడని ఎద్దేవా చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఏవుసం  వల్ల ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు లైన్లో నిలుచున్న వ్యక్తులు రైతులు కారని, కావాలని చేస్తున్నారని మాట్లాడడం సిగ్గుచేటు అని, కండ్లు ఉండి చూడలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత లేదని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్న స్థానిక ఎమ్మెల్యే స్వంత గ్రామం రుద్రంగిలో, నిన్న మొన్న చందుర్తిలో, ఎల్లారెడ్డిపేటలో, సోమవారం రోజున వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో యూరియా కోసం బారులు తీరారని, క్యూలైన్లో నిల్చున్న రైతులే స్వయాన 10 ఏళ్లలో ఎప్పుడు క్యూలో నిల్చోలేదని అంటున్నారని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత సృష్టించి రైతులను అరికోస పెడుతున్నారని  మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని సకాలంలో రైతులకు యూరియా సర్వాలు చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.