28-06-2025 12:43:56 AM
తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్
ముషీరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): పాఠశాల విద్య, గెజిటెడ్ ప్రధానో పాధ్యాయులకు బదిలీలు చేపట్టిన తర్వాతే ఖాళీగా ఉన్న 700 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని తెలం గాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్(టీఎస్ జీహెచ్‌ఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు ఆర్. రాజగంగా రెడ్డి మాట్లాడారు.
2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గెజిటెడ్ ప్రధానో పాధ్యాయుల పోస్టు మల్టీ జోన్ స్థాయిలోకి చేర్చడం జరిగిందన్నారు. 2023-24లో స్కూల్ అసిస్టెం ట్‌లకు గెజిటెడ్ ప్రధా నోపాధ్యా యులుగా పదోన్నతులు ఇచ్చినప్పుడు కొన్ని వందల మంది ప్రధానోపాధ్యాయులుగా వారి సొంత జిల్లాలలో అవకాశం లేకపోవడం వలన మల్టీ జోన్ పరిధిలోని ఇతర జిల్లాలలో పదోన్నతి తీసుకోవడం జరిగింద న్నారు.
ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. గిరిధర్ గౌడ్, నాయకులు, కె.దామోదర్ రెడ్డి, కె.కృష్ణ చారి, శ్రీనివాస్, రత్నాకర్ రెడ్డి, అచ్యుత రెడ్డి, వేణుగోపాల్ రావు, రంగారావు, రఘు నందన్ చారి, నరేందర్, ప్రసూన, శైలజ, ఇందు ప్రియ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.