calender_icon.png 14 October, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ గా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్

14-10-2025 06:54:29 PM

హనుమకొండ (విజయక్రాంతి): బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గా హన్మకొండకు చెందిన వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నియమితులయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, జీవో 9 ఆర్డినెన్స్ తో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అగ్ర కులస్తులు సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించి రిజర్వేషన్లను అడ్డుకుంటూ, అగ్రవర్ణాలు బీసీలకు చేస్తున్న మోసాలను  ఎదుర్కొనుటకు  రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ ఏకమై బీసీ జేఏసీగా ఏర్పడినవి. రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్  నియమితులయ్యారు.

ఈ క్రమంలో గత 20 సంవత్సరాలుగా  వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని తన భుజస్కంధలపై మోసిన బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ని బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గా నియమిస్తు మంగళవారం బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలను రాజకీయంగా ఎదగకుండా, స్థానిక సంస్థలు ఎన్నికలు 42% రిజర్వేషన్లు అడ్డుకుంటున్న అగ్రవర్ణాలను ఎదుర్కొనుటకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీసీ కులస్తులందరినీ చైతన్య పరుస్తూ బీసీలందరిని ఏక తాటిపైకి తీసుకొని వచ్చి 42% రిజర్వేషన్ సాధించేంతవరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలుపెరుగకుండా బీసీ పోరాటం చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర బీసీ జేఏసీ వైస్ చైర్మన్ వి. నారగోని, రాష్ట్ర బీసీ జేఏసీ కో చైర్మన్లు రాజారామ్ యాదవ్, దాసు సురేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవి కృష్ణ గౌడ్ కు ధన్యవాదములు తెలిపారు.