29-10-2025 07:34:23 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): మాజీమంత్రి తన్నీరు హరీష్ రావును ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. నిన్న హరీష్ రావు తండ్రి నారాయణ రావు అనారోగ్యంతో పరమపదించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం హైదరాబాద్ లోని హరీష్ రావు స్వగృహంకు వెళ్లిన ఎమ్మెల్యే నారాయణ రావు ఫొటోకు పూలమాల వేసి శ్రద్ధాంజలి తెలిపి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బోథ్ మాజీ ఏమ్మెల్యే రాథోడ్ బాపురావులు సైతం హరీష్ రావును కలిసి పరామర్శించారు.