calender_icon.png 26 July, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులు రక్షణ సూత్రాలు పాటించాలి

26-07-2025 12:00:00 AM

డీఎంఎస్ ఎన్ నాగేశ్వర రావు

మందమర్రి, జూలై 25: సింగరేణి సంస్థ లో భూగర్భ గనులు, డిపార్ట్ మెంట్‌లలో వి ధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు రక్షణ సూ త్రాలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని హైదరాబాద్ రీజియన్ సౌత్ సెంట్రల్ జోన్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్) ఎన్ నాగేశ్వరరావు కోరారు. ఎల్లందు క్లబ్‌లో శు క్రవారం నిర్వహించిన 23వ ఏరియా స్థాయి రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రతి ఉద్యోగికి రక్షణ సూత్రాలపై అవగాహన కల్పించి, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణతో పని చేయించాలని సూచించారు. సింగరేణి డైరెక్టర్(పీ.పీ) కె వెం కటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణిలో రక్షణ చర్యలపై యాజమాన్యం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. జిఎం సేఫ్టీ కార్పొరేట్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా రక్షణపై ఉద్యోగులు, అధికారుల కు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా అధికారులు, కార్మిక సంఘాల నాయకులు రక్షణ ప్రతిజ్ఞ చేశారు.  ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాం సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, డిఎంఎస్(ఎ లక్ట్రికల్)  రాజ్‌కుమార్, డీవైడీఎంఎస్ (ఎలక్ట్రికల్) రాజీవ్ ఓం ప్రకాశ్ వర్మ, (మెకానిక ల్) దిలీప్ కుమార్, (మైనింగ్) హైదరాబాద్ రీజియన్ ప్రేమ్ కుమార్, డిడిఎమ్‌ఎస్(ఎలక్ట్రికల్), కోమల్ చౌదరి, (మెకానికల్) అనికే త్ సింగ్ ఇతర అధికారలు పాల్గొన్నారు.