03-08-2025 10:03:53 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో బోనాల పండుగ నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ఈ ఏడు అంతా మంచి జరగాలని, ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవించేలా చూడాలని వేడుకున్నారు. ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించి కోళ్లు, మేకలు బలి ఇచ్చారు.