03-08-2025 09:57:08 PM
భద్రాచలం,(విజయక్రాంతి): 1995-1996 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు మూడు దశబ్దాల క్రిందట భద్రాచలం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ హై స్కూలు నందు పదో తరగతి చదివిన విద్యార్థులు చదివి వేరే వేరే వృత్తులలో స్థిరపడగా ఆదివారం భద్రాచలంలో కలిసి ఫ్రెండ్షిప్ వేడుకలు నిర్వహించారు. 1995 -96 లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అదివారం పట్టణం లోని గోదావరి గ్రాండ్ ఇన్ హోటల్ నందు గెట్ టుగెథెర్ నిర్వహించారు.
మందుగా లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల ఆధినేత కీర్తి శేషులు మాగంటి సూర్యం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘణంగా నివాళుళు అర్పించారు. అప్పుడు పాఠాలు బోధించిన సురేష్ తోటమల్ల, పివి రమణ, అగస్టీన్, సాయిబాబు, శ్రీనివాస్, రాజులను ఘణంగా సన్మానించారు. చిన్ననాటి ఙ్ఞాపకాలు గురుతు చేసుకొన్నారు. గురువులతో ఉన్న అనుబంధాలు, బోధించిన తీరు చర్చించుకున్నారు. దేశ, విదేశాలలొ స్థిరపడిన వారంతా ఈ కార్యమంలో పాల్గొన్నారు. గుర్తు కొస్తున్నాయి అంటూ సందడి చేసారు .