08-10-2025 12:41:55 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, అక్టోబర్ 7 :పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానం కేంద్రంగా ఈనెల 16, 17, 18 తేదీలలో నిర్వహించనున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలను నిర్వహించేందుకు పటాన్చెరు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా ఇందుకు సమ్మతించినట్లు ఆయన తెలిపారు.
అండర్ 17 బాలుర వాలీబాల్, అండర్ 14 బాలురు, బాలికల కబడ్డీ పోటీలను అక్టోబర్ 16, 17, 18 తేదీలలో పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 420 మంది క్రీడాకారులతో పాటు 200 వందల మంది వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది క్రీడలలో పాల్గొనబోతున్నారని తెలిపారు. వీరందరికి మూడు రోజులపాటు భోజనం, వసతి, బహుమతులు సొంత నిధులతో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, సిఐ వినాయక్ రెడ్డి, జిహెచ్‌ఎంసి డిబేట్ కమిషనర్ సురేష్, మండల విద్యాశాఖ అధికారులు పిపి రాథోడ్, నాగేశ్వరరావు నాయక్, ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దీన్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.