calender_icon.png 12 August, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీ పేపర్‌లీక్ సినిమాను ఆదరించండి

12-08-2025 01:24:45 AM

- ప్రొఫెసర్లు హరగోపాల్, కాశీం

- ఆగస్టు 22న సినిమా విడుదల 

ఖైరతాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి) : ప్రముఖ దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి  రూపొందించిన  యూనివర్సిటీ పేపర్ లింక్ సినిమాను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని ప్రొఫెసర్ హరగోపాల్, ఓయూ ఆరట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాశీం లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లతో కలిసి మాట్లాడారు..విద్యా రంగంలో వస్తున్న వక్రీకరణ లు దానివల్ల సమాజంలో జరుగుతున్న మార్పు ల ఆధారంగా నారాయణమూర్తి చక్కటి సినిమాను రూపొందించడం జరిగిందని తెలిపా రు.

సమాజంలో అన్ని రంగాలలో  ప్రయోగాలు చేసే వ్యక్తులు ఉంటారని  సినిమా రంగంలో ఆర్ నారాయణ మూర్తి అని అన్నారు. విద్యారంగంలో సమూల మార్పు ల కోసం విద్యా పరిరక్షణ కమిటీ 40 సంవత్సరాలు ఎంతో ప్రయత్నం చేసిన యువత లో పూర్తిస్థాయిలో మార్పు తీసుకురాలేకపోయిందని తెలిపారు. మళ్లీ అదే ప్రయత్నం ఆర్ నారాయణ మూర్తి సినిమా ద్వారా చేయడం ఎంతో గొప్ప విషయం అని కొనియాడారు. నేడు దేశవ్యాప్తంగా విద్య వైద్యం కార్పోరేట్ శక్తుల కబంధహస్తాల్లో నలిగిపోతుందని దానివల్ల సమాజంలో ఎన్నో దుష్ప్రభావాలు జరుగుతున్నాయన్నారు.

ఒక మధ్యతరగతి కుటుం బం తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు ఎంత కష్టపడతారు, తల్లిదండ్రుల కిడ్నీలు అమ్ముకొని ఉన్నత విద్యను చదివించడం, తదనంతరం పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ అవడం, దానివల్ల సమాజంలో ఎంత దుర్మార్గం జరిగిందని అంశాల పై యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాలు తీయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు  రాష్ట్ర  కార్యద ర్శి నాగ రాజు, ఎన్‌ఎస్‌యుఐ కార్యదర్శి వెం కటస్వామి, వివిధ కళాశాల ప్రొ ఫెసర్లు, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.