08-11-2025 12:00:00 AM
దేశభక్తి గీతంతో మారుమ్రోగిన కూషాయిగూడ పోలీస్‌స్టేషన్
కాప్రా, నవంబర్ 7 (విజయక్రాంతి) : వందేమాతరం గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తున సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలలో భాగంగా కూషాయిగూడ పోలీస్‌స్టేషన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు సామూహిక వందేమాతరం గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో నారాయణ స్కూలుకు చెందిన సు మారు 200మంది విద్యార్థులు, స్థానిక పౌరు లు, పోలీస్ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కూషాయిగూడ ఏసీపీ. వై. వెంకటరెడ్డి, ఎస్‌హెచ్‌వో ఎల్. భాస్కర్‌రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొని జాతీయ గీతానికి స్వరమాల వేశారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుం టూ వందేమాతరం గీతం దేశభక్తి ఉత్సాహాన్ని రగిలించింది. విద్యార్థులు, పోలీస్ సిబ్బంది ఒకే స్వరంలో ఆలపించిన ఈ గీతం దేశభక్తి జ్వాలలు రగిలించినట్లు ప్రత్యక్షంగా చూసినవారు తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ వందేమాతరం మన జాతీయ గౌరవానికి ఐక్యతకు ప్రతీక, యువత దేశప్రేమతో ముందుకు సాగాలని ఈ గీతం మనకు స్ఫూర్తినిస్తుం దన్నారు. స్థానిక పౌరులు పోలీసుల ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని అభినందించారు.