24-01-2026 01:00:56 AM
సరస్వతి క్షేత్రంలో ఘనంగా వసంత పంచమి
గజ్వేల్, జనవరి 23: సరస్వతి దేవి జన్మదినమైన వసంత పంచమి వేడుకలు సిద్ది పేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. గురు మదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా శ్రీ శారద స్మార్త వేద విద్యాలయ విద్యార్థులకు జయ పట్టాల పంపిణీ చేశారు. వేల సంఖ్యలో హాజరైన భక్తులు తమ చిన్నారులకు విద్యా సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
6 వేలకు పైగా అక్షర స్వీకారాలు జరిగాయి. కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, పుష్పగిరి పీఠాధిపతి, పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు విద్యాశంకర భారతి తీర్థ స్వామీజీ, ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆంక్షారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గుప్త అమ్మవారిని దర్శించుకున్నారు.