calender_icon.png 9 January, 2026 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నివర్గాల ప్రజలకు వాసవీ క్లబ్ సేవలు

07-01-2026 12:02:07 AM

కల్వకుర్తి జనవరి 6: వాసవి క్లబ్ సేవలను మరింత విస్తృత పరిచి అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా ముందుకు వెళ్తామని క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రెటరీ సర్వీసెస్ జూలూరు రమేష్ బాబు అన్నారు. మంగళవారం క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిద్ధ వెంకట సూర్య ప్రకాష్ రావు నుండి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రెటరీ సర్వీసెస్ గా నియామక పత్రం అందుకొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న వాసవి క్లబ్ సేవలను బలోపేతం చేసి అన్ని వర్గాలకు సేవలు అందించే విధంగా ముందుకు సాగుతామన్నారు. ఎన్నో అవార్డులు సాధించి సేవలకు వన్నెతెచ్చిన ఘనత వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ది అన్నారు.

సైనికుల సంక్షేమం నిధి కోసం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు రూ.25 లక్షల చెక్కు అందించామన్నారు. ఈ సంవత్సరం నూతన అధ్యక్షుని ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి సామాజిక సేవా కార్యక్రమాలతో పని చేస్తామన్నారు. అనంతరం జూలూరు రమేష్ బాబు, రాజేశ్వరి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.