30-01-2026 12:00:00 AM
మీడియా సమావేశంలో బీజేపీ
జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి
మానకొండూరు, జనవరి 29 (విజయక్రాంతి): ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, కూలీల సంక్షేమమే ధ్యే యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ( విక్షి త్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్) (గ్రామీణ) వీబీజీరామ్ జీ 2025 చట్టం లక్ష్యమని కరీంనగర్ భాజపా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి చెప్పా రు. ఈ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం దా రుణమని, పని దినాల పెంపే లక్ష్యంగా, గ్రా మ స్వరాజ్యం బలోపేతమే లక్ష్యంగా తీసుకువచ్చిన వీ బీజీ రామ్ జీ చట్టంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తూ రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తుందని మండిపడ్డా రు. కేవలం వీ బీ జీ రామ్ జీ చట్టంలో ’రామ్’ అనే పేరున్నందుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. గురువారం మండల కేంద్రమైన మానకొండూరు లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గంగాడి కృష్ణా రెడ్డి మాట్లాడారు.
వీ బీ జీ రామ్ జీ చట్టంపై బుధవారం మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీ బీ జీ రామ్ జీ చట్టంపై దుష్ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ మంచి పని చేపట్టినా అడ్డుపడటమే కాంగ్రెస్ అలవాటుగా మా ర్చుకుందని ఆయన ఘాటుగా విమర్శించా రు. 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వ పాలనలో తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించినా ఆ పార్టీ నాయకుల వ్య వహార శైలిలో మార్పు రావడం లేదన్నారు.
దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలతో నేడు కేవలం మూడు రాష్ట్రాలకే అధికారం పరిమితం చేసి నా ఆ పార్టీ తీరు మారలేదని ఎద్దేవా చేశా రు. ప్రధానంగా వీ బీ జీ రామ్ జీ చట్టంలో కూలీలకు ఏటా 125 రోజుల పని కల్పించే చట్టబద్ధమైన గ్యారెంటీ, పనిచేసిన 15 రోజుల్లోపే నేరుగా ఖాతాల్లోకి వేతనాల జమ అ వుతాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ బడ్జెట్ను రూ. 86 వేల కోట్ల నుంచి రూ. 1.50 లక్షల కోట్లకు పెంచడం జ రిగిందని తెలిపారు. చట్టంలో తెలంగాణకు అదనంగా రూ. 346 కోట్ల నిధులను కేటాయించి, ఉపాధి కూలీలకు కేంద్రం అండగా నిలబడిందని ఆయన పేర్కొన్నారు.డిజిటల్ హాజరు ద్వారా అవినీతికి తావులేకుండా అ ర్హులైన కూలీలకు సరైన వేతనం అందుతుందని అన్నారు.ఉపాధి హామీ చట్టంపై కాం గ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని గ్రామగ్రామా న తిప్పికొట్టాలని ఆయన బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మండలాధ్యక్షులు కందిరాజి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల, వెంకట్ రెడ్డి, రంగు భాస్కరాచారి, వీ బీ జీ రామ్ జీ జిల్లా కన్వీనర్ కరివేద మహిపాల్ రెడ్డీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అప్పని తిరుపతి, మాజీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్,మియపురం లక్ష్మణచారి, సోన్నకుల శ్రీనివాస్,వార్డు సభ్యులు భాషబోయిన ప్రదీప్ యాదవ్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.