05-07-2025 08:30:38 PM
కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండల బీజేపీ నాయకులు దేవరకద్ర బాలన్నకు డాక్టరేట్ వచ్చిన సందర్బంగా కొత్తకోట సగర సంఘం ఆధ్వర్యంలో శనివారం సన్మాన కార్యక్రమం సగరులు ఏర్పాటు చేశారు. ముందుగా ఆయనకు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం దేవరకద్ర బాలన్న మాట్లాడుతూ తన సేవలు గుర్తించి తనకు ఈ గౌరవ డాక్టరేట్ అందించినటువంటి" గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ" వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇకముందు ఈ సేవలు ఇలాగే కొనసాగిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటానని డాక్టరేట్ అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని మరింత ఉత్సాహంతో పనిచేయడానికి తనకు ఈ డాక్టరేట్ వెయ్యిరెట్లు బలం ఇచ్చిందని అన్నారు. సన్మానం చేసిన సగరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.